Subscribe

RSS Feed (xml)

ఆస్ట్రేలియా తొలి మహిళా ప్రధానిగా గిల్లార్డ్‌ ప్రమాణ స్వీకారం

ఆస్ట్రేలియా ప్రభుత్వానికి మొట్టమొదటి సారిగా ఓ మహిళ ప్రధానమంత్రిగా ఎన్నికైంది. ఆస్ట్రేలియాకు చెందినన జులియా గిల్లార్డ్‌ గత నెలలో జరిగిన ఎన్నికల్లో గెలిచి ఆ దేశ తొలి మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో లేబర్ పార్టీ నాయకురాలు గిల్లార్డ్‌ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు.

దేశ రాజధాని క్రాన్‌బెర్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో జులియా గిల్లార్డ్‌ తన భర్త టిమ్‌ మాథ్యుసన్‌తో కలిసి బ్రిటన్‌ రాణికి విధేయురాలిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అధికారికంగా ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపడూ పత్రాలపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో గిల్లార్డ్‌తో పాటు 19మంది ఎంపీలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మూడు నెలల కిందట లేబర్‌ పార్టీ నేత కెవిన్‌ రుడ్‌ ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవడంతో గత నెలలో జరిగిన ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఒక్క స్థానం మెజారీటిని సాధించి మైనారిటీ సర్కారును ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కెవిన్‌ రుడ్‌‌కు విదేశాంగమంత్రిగా గిల్లార్డ్‌ అవకాశమిచ్చారు. అంతే కాకుండా.. కొత్త మంత్రివర్గంలో రక్షణశాఖమంత్రిగా స్టీఫెన్‌ స్మిత్‌, విత్త మంత్రిగా వేన్‌ స్వాన్‌ నియమితులయ్యారు.

0 comments:

Related Posts with Thumbnails