Subscribe

RSS Feed (xml)

ఒబామాను తిడుతూ ఈ-మెయిల్ పంపిన యువకుడు

బ్రిటన్‌కు చెందిన ఓ యువకుడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను అవమానపరచే విధంగా అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ శ్వేత సౌధాని(వైట్ హౌస్)కి ఓ ఈ మెయిల్‌ను పంపించాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఆ యువకుడిని అమెరికా నుంచి బహిష్కరిస్తూ జీవితకాల నిషేధం విధించారు.

సెప్టెంబర్ 11 దాడులకు నిరసనగా పంపిన తన ద్వేషపూరిత ఈ-మెయిల్‌లో ఒబామాను అవమానించే విధంగా ఆ యువకుడు పంపాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన ఎఫ్‌‌బీఐ పోలీసులు ఈ-మెయిల్ పంపిన యువకుడిని బ్రిటన్‌కు చెందిన లూకే ఏంజిల్(17)గా గుర్తించిన పోలీసులు ఆ యువకుడిని అమెరికాలో ప్రవేశించకుండా తనపై జీవితకాల నిషేధాన్ని విధిస్తున్నట్లు తెలిపారు.

ఏమైనప్పటికీ ఆ కాలేజి కుర్రాడు మాత్రం తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పలేదు. పైపెచ్చు ఇటువంటివి అస్సలు లెక్క చేయనని కొట్టి పారేశాడు. "పోలీసులు నన్ను చుట్టుముట్టి, నా ఫోటో తీసుకుకొని, నన్ను అమెరికా నుంచి బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. నేను దీనిని లెక్కచేయను, కానీ నా తల్లిదండ్రులు మాత్రం ఈ విషయంపై సంతోషంగా లేరు" అని లూకే అన్నాడు. అయితే పోలీసులు మాత్రం ఆ కుర్రాడిపై ఎటువంటి క్రిమినల్ కేసును నమోదు చేయలేదు.

0 comments:

Related Posts with Thumbnails