Subscribe

RSS Feed (xml)

దేశంలో మళ్లీ సైనిక పాలనా.. నో ఛాన్సెస్: పాక్ ప్రధాని

పాకిస్థాన్ మరోమారు సైనిక పాలనలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టు వస్తున్న మీడియా ఊహాగానాలను ఆ దేశ ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీ కొట్టిపారేశారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందని, అందువల్ల సైనిక తిరుగుబాటు వచ్చేందుకు అవకాశమే లేదని ఆయన నొక్కివక్కాణిస్తున్నారు.

ఇస్లామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోని ప్రజస్వామ్య ప్రభుత్వానికి కీలక సమయాల్లోనే సైనిక సహకారం అవసరమన్నారు. ప్రస్తుతం వరద సాయంలో సైనిక సాయాన్ని తప్పనిసరన్నారు.

అదేసమయంలో దేశంలో మళ్లీ సైనిక పాలన రాబోతుందని వస్తున్న వార్తలపై వ్యాఖ్యానించడం సమయాన్ని వృధా చేసుకోవడమేనన్నారు. దేశ రక్షణ శాఖ, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రెండు వేర్వేరు మార్గాల్లో పయనించడం లేదని గిలానీ స్పష్టం చేశారు.

మరోసారి అలా జరిగితే భారత్-పాక్‌ల మధ్య యుద్ధమే!

‘26/11’ తరహాలో మరోసారి జరిగితే భారత్-పాకిస్థాన్‌ల మధ్య పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని వాషింగ్టన్‌కు చెందిన ప్రముఖ పరిశోధన సంస్థ వెల్లడించింది. ముంబయి తరహా దాడులు పునరావృతం కాకుండా అరికట్టడం అమెరికా విదేశాంగ విధానానికి అతిపెద్ద సవాల్ అని ఆ సంస్థ తమ నివేదికలో పేర్కొంది.

పీటర్ బెర్జన్, బ్రూస్ హోఫ్‌మన్ ఆధ్వర్యంలో తయారైన ‘ఉగ్రవాద ముప్పుపై అంచనా’ అనే నివేదికలో ముంబయి దాడుల తరహా మరో దాడి జరిగిన పక్షంలో అది భారత ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి తెచ్చి తీవ్ర చర్యకు కారణం కావచ్చని ఆ పరిశోధన సంస్థ తెలిపింది.

ఇంకా వందలాది ప్రాణాలను బలిగొన్న 26/11 దాడులు పునరావృతం కాకుండా చూడటమే బైపార్టిషన్ పాలసీ సెంటర్‌కు చెందిన జాతీయ భద్రతా సన్నాహక విభాగం తమ 42 పేజీల నివేదికలో పేర్కొంది.

పాక్‌లో మరో వివాహ చట్టమా..? నో ఛాన్స్..!!: నవాజ్

ముస్లిం వివాహ సంప్రదాయాల ముసుగులో మోసాలకు పాల్పడుతున్నవారిని నిలువరించడానకి పాకిస్తాన్‌లో మరో వివాహ చట్టాన్ని తేవాలన్న అభిప్రాయాన్ని పాక్ మాజీప్రధాని, పీఎంఎల్ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్ తోసిపుచ్చారు.

శనివారం రంజాన్ పండుగ సందర్భంగా ఆయన పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలను సందర్శించారు. వరద తాకిడితో నిరాశ్రయులైన ప్రజలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వీట్లు, దుస్తులు, బహుమతులను పంచిపెట్టారు.

ప్రభుత్వం పలు రంగాల్లో పూర్తిగా విఫలమవడాన్ని ప్రజాస్వామ్యం విఫలమైనట్లుగా అభివర్ణించడం తగదని ఆయన అన్నారు. అయితే వరద బాధితులకు సత్వర సహాయక చర్యలు చేపట్టి ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందిన్నారు.

Related Posts with Thumbnails