Subscribe

RSS Feed (xml)

ఎ.ఆర్. రెహమాన్ కామన్వెల్త్ థీమ్‌సాంగ్‌లో మార్పులు

 
FILE
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ ఆతిథ్య మిస్తోన్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ ఆరంభ వేడుకల కోసం ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్. రెహమాన్ ప్రత్యేకంగా రూపొందించిన థీమ్‌సాంగ్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి.

రెహమాన్ రూపొందించిన థీమ్‌సాంగ్‌లో అంత క్రేజ్‌ లేదని ఆరోపణలు వెలువెత్తినప్పటికీ.. కామన్వెల్త్ క్రీడల థీమ్ సాంగ్‌ను రీ కంపోజ్ చేసే ఉద్దేశ్యం లేదని రెహమాన్ తేల్చి చెప్పేశాడు.

ఇంకా 'ఇండియా బులా లియా' అనే పాట ప్రజల అంచనాలను అందుకోవడంలో విఫలమైందని, నిర్వాహక కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ వీకే మల్హోత్రా సహా పలువురు ఈ పాటపై పెదవి విరిచిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ప్రాచుర్యం పొందిన షకీరా పాట 'వాకా.. వాకా', 'చక్‌దే ఇండియా' సినిమాలోని టైటిల్ సాంగ్‌లా స్ఫూర్తిదాయకంగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు రావడంతో పాటలో కొన్ని మార్పులు చేసినట్లు తెలిసింది.

ఈ విషయమై ఈ పాటను రచించిన ప్రసూన్ జోషి స్పందిస్తూ.. 'సాంగ్‌ను కుదించడంతోపాటు కొన్ని మార్పులు చేశారు. వచ్చేవారంలో విడుదలయ్యే ఈ కొత్త వీడియోలో దీన్ని గమనించవచ్చునని వెల్లడించారు.

0 comments:

Related Posts with Thumbnails