వచ్చే నవంబరు నెలలో భారత్ పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అమృతసర్‌లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించనున్నారు. అలాగే, దేశంలోని మరికొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఒబామా న్యూఢిల్లీ పర్యటన ఇంకా అధికారపూర్వకంగా ఖారారుకాలేదు. అయితే, ఆయన స్వర్ణదేవాలయాన్ని సందర్శించనున్నట్టు వస్తున్న వార్తల పట్ల మైనార్టీ సిక్కు వర్గానికి చెందిన నేతలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఒబామా స్వర్ణ దేవాలయ సందర్శనతో అమెరికా ప్రజలు సిక్కులు, సిక్కు వాదం గురించి మెరుగైన అవగాహన ఏర్పడగలదని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఒబామా స్వర్ణ దర్శనం అమెరికాలోని సిక్కుల పట్ల గల అపార్థాలను తొలగిస్తుందని ఆయన చెప్పారు.
స్వర్ణదేవాలయాన్ని సందర్శించనున్న బరాక్ ఒబామా!
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment