పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆ దేశ ప్రజలకు వ్యతిరేకి అని ప్రముఖ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరి ఆరోపించాడు. జర్ధారీ పాకిస్థాన్ ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని సీఎన్ఎన్ న్యూస్ ఛానెల్‌కు పంపిన ఓ లేఖలో జవహరి ధ్వజమెత్తాడు.
ఆప్ఘనిస్థాన్‌లో అమెరికా జరుపుతున్న యుద్ధాన్ని, పవిత్ర ఖురాన్‌కు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న ద్రోహాన్ని జర్ధారీ ప్రోత్సహించడంతో పాటు మద్దతిస్తున్నారని జవహరి ఆ లేఖలో వెల్లడించాడు.
ఇంకా "జర్ధారీ ఓ దొంగ అధ్యక్షుడు" అని జవహరి ఆక్రోశం వెల్లగక్కాడు. జర్దారీ చర్యల పట్ల పాకిస్థాన్ ప్రజలు మౌనం వహించడం ద్వారానే అధ్యక్షుడి వ్యతిరేక చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయని జవహరి ఆ లేఖలో తెలిపారు.
వచ్చే నవంబరు నెలలో భారత్ పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అమృతసర్‌లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించనున్నారు. అలాగే, దేశంలోని మరికొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఒబామా న్యూఢిల్లీ పర్యటన ఇంకా అధికారపూర్వకంగా ఖారారుకాలేదు. అయితే, ఆయన స్వర్ణదేవాలయాన్ని సందర్శించనున్నట్టు వస్తున్న వార్తల పట్ల మైనార్టీ సిక్కు వర్గానికి చెందిన నేతలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒబామా స్వర్ణ దేవాలయ సందర్శనతో అమెరికా ప్రజలు సిక్కులు, సిక్కు వాదం గురించి మెరుగైన అవగాహన ఏర్పడగలదని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఒబామా స్వర్ణ దర్శనం అమెరికాలోని సిక్కుల పట్ల గల అపార్థాలను తొలగిస్తుందని ఆయన చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment