ఇరాక్ జైళ్లలో విచారణకు నోచుకోని 30 వేల మంది ఖైదీలు చిత్రహింసలకు గురవుతున్నారని అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన నివేదికలో తెలిపింది. ఖైదీలను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారని పేర్కొంది.
గత నెలలో యుద్ధ విధుల్లో ఉన్న అమెరికా సైనికుల ఉపసంహరణ పూర్తయిన నేపథ్యంలో బందీలుగా ఉన్న ఖైదీలను ఇరాక్‌కు అప్పగించినట్లు ఆమ్నెస్టీ తెలిపింది. ఈ ఖైదీలకు ఎలాంటి విచారణ లేకుండా, కనీసం న్యాయవాదులను కూడా అందుబాటులో లేకుండా ఉంచినట్లు ఆమ్నెస్టీ తన నివేదికలో వెల్లడించింది. వీరి కోసం ప్రత్యేకంగా రహస్య జైళ్లను ఉపయోగించినట్లు ఆ సంస్థ ఆరోపించింది.
అంతే కాకుండా.. బందీలను క్రూరంగా విద్యుత్‌తీగలతో కొట్టడం, కరెంట్ షాక్ పెట్టడం, వేళ్ళు తొలగించడం, గోళ్ళు పీకడం వంటి చిత్రహింసలకు గురిచేసినట్లు ఆ నివేదిక విమర్శించింది. ఫలితంగా కొందరు ఖైదీలు జైళ్లలోనే ప్రాణాలు కోల్పోతున్నారని ఆమ్నెస్టీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా మరిణించిన వారిని సాధారణ మరణంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది.
ఖైదీల హక్కులను కాలరాస్తున్న ఇరాకీ దళాలే ఇందుకు బాధ్యత వహించాలని ఆమ్నెస్టీ ఆసియా, ఆఫ్రికా డైరెక్టర్ మాల్కం స్మార్డ్ డిమాండ్ చేశారు. చట్ట విరుద్ధంగా యువకులను అదుపులోకి తీసుకున్న కేసులే ఎక్కువయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ఖైదీలకు కరెంట్ షాక్ ఇచ్చి గోళ్లు పీకుతున్నారు: ఆమ్నెస్టీ
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment