పాకిస్థాన్ మరోమారు సైనిక పాలనలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టు వస్తున్న మీడియా ఊహాగానాలను ఆ దేశ ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీ కొట్టిపారేశారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందని, అందువల్ల సైనిక తిరుగుబాటు వచ్చేందుకు అవకాశమే లేదని ఆయన నొక్కివక్కాణిస్తున్నారు.
ఇస్లామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోని ప్రజస్వామ్య ప్రభుత్వానికి కీలక సమయాల్లోనే సైనిక సహకారం అవసరమన్నారు. ప్రస్తుతం వరద సాయంలో సైనిక సాయాన్ని తప్పనిసరన్నారు.
అదేసమయంలో దేశంలో మళ్లీ సైనిక పాలన రాబోతుందని వస్తున్న వార్తలపై వ్యాఖ్యానించడం సమయాన్ని వృధా చేసుకోవడమేనన్నారు. దేశ రక్షణ శాఖ, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రెండు వేర్వేరు మార్గాల్లో పయనించడం లేదని గిలానీ స్పష్టం చేశారు.
దేశంలో మళ్లీ సైనిక పాలనా.. నో ఛాన్సెస్: పాక్ ప్రధాని
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment