పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆ దేశ ప్రజలకు వ్యతిరేకి అని ప్రముఖ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరి ఆరోపించాడు. జర్ధారీ పాకిస్థాన్ ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని సీఎన్ఎన్ న్యూస్ ఛానెల్‌కు పంపిన ఓ లేఖలో జవహరి ధ్వజమెత్తాడు.
ఆప్ఘనిస్థాన్‌లో అమెరికా జరుపుతున్న యుద్ధాన్ని, పవిత్ర ఖురాన్‌కు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న ద్రోహాన్ని జర్ధారీ ప్రోత్సహించడంతో పాటు మద్దతిస్తున్నారని జవహరి ఆ లేఖలో వెల్లడించాడు.
ఇంకా "జర్ధారీ ఓ దొంగ అధ్యక్షుడు" అని జవహరి ఆక్రోశం వెల్లగక్కాడు. జర్దారీ చర్యల పట్ల పాకిస్థాన్ ప్రజలు మౌనం వహించడం ద్వారానే అధ్యక్షుడి వ్యతిరేక చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయని జవహరి ఆ లేఖలో తెలిపారు.
No comments:
Post a Comment